![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -21 లో.... మహా అన్నమాటలకి భూషణ్ కోపంగా ఉంటాడు. భూషణ్ తో అలా మాట్లాడినందుకు మహాపై ప్రతాప్ చెయ్ చేసుకుంటాడు. నన్ను సైకో అంటుంది. ఇలా పెంచారేంటి అంకుల్ అని ప్రతాప్ తో భూషణ్ అనగానే దానికేం తెలియదు బాబు ఈ ఒక్కసారికి క్షమించండి అని ప్రతాప్ అనగానే.. మా అమ్మవాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని భూషణ్ అంటాడు. వద్దు బాబు చెప్పకండి అని మహా వాళ్ల అమ్మ అంటుంది.
భూషణ్ వెళ్ళిపోయాక మహాతో మాట్లాడాలి వెళ్లి తీసుకొని రా అని ఆదిత్యని పంపిస్తాడు. అది వెళ్లి మహా నిన్ను డాడీ రమ్మంటున్నాడని చెప్తాడు. ఇంకా ఏమైనా అనేటివి ఉన్నాయా అని మహా కోపంగా మాట్లాడేసరికి హారిక నువ్వు తనని తీసుకొని రా అని ఆదిత్య చెప్పి వెళ్ళిపోతాడు. మహా కిందకి వస్తుంది. నువ్వు అల్లుడు గారితో ఇక బాగుండాలని మహాతో వాళ్ళ నాన్న చెప్తాడు. వాడు నాకు ఇష్టం లేదని మహా అంటుంది. ఎందుకు ఇష్టం లేదు ఒక కారణం చెప్పమని అడుగుతాడు. నువ్వు ఇంకా ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని ప్రతాప్ అనగానే అందరు షాక్ అవుతారు. మీరు నా గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి.. నేను ఎలాంటి దానినో మీకు తెలియదా అని మహా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఏది ఏమైనా భూషణ్ తో నీ పెళ్లి జరుగుతుందని ప్రతాప్ చెప్తాడు. అదంతా చక్రి వింటాడు. మహా గురించి చక్రి ఆలోచిస్తాడు. అప్పుడే మహా కోపంగా వచ్చి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోదామనుకుంటున్న. నా మనసు ఏంటో అర్థం చేసుకొని చోట నేను ఉండను కమ్యూనిటి గురించి ఆలోచిస్తున్నారు కానీ కన్నకూతురు గురించి ఆలోచించడం లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి.. ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి నువ్వు హెల్ప్ చేస్తావా అని మహా అనగానే సరే అని చక్రి అంటాడు.
మరుసటిరోజు ప్రతాప్ , తన భార్య కులదైవం గుడికి వెళ్తుంటే.. అల్లుడు గారు ఫోన్ చేస్తే బాగా మాట్లాడమని ప్రతాప్ కోపంగా చెప్తాడు. మహా అసలు వాళ్ల నాన్న వైపు కూడా చూడదు. ఆ తర్వాత మహా వాళ్ల అమ్మ కార్ దగ్గర వరకు వెళ్లి.. మళ్ళీ మహా దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో మహా ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |